అత్యాశ
ఒక ఊర్లో రాము అనే పేదవాడు ఉండేవాడు . అతడు అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకొచ్చి ఊళ్లో అమ్మేవాడు. అతని భార్య సీత. ఆమెకే ఆశ ఎక్కువ.
ఒకరోజు రాము కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక చాటు వేటగాడు వలలో ఒక బంగారు లేడి చిక్కుకొని కనిపించింది. రాము జాలిపడి ఆ జింకని వలలోనుంచి తప్పించాడు.
అప్పుడు ఆ జింక. నువ్వు నా ప్రాణాలు రక్షించావు. నువ్వు ఏది కోరితే అది ఇస్తాను అని అంది.
నా భార్యను అడిగి వచ్చి కోరుకుంటాను అని చెప్పి ఇంటికి వచ్చి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు.
రాము నువ్వు వెంటనే వెళ్లి మనకి ఇల్లు కావాలి అని అడుగు అని చెప్పింది భార్య. భార్య చెప్పిన ప్రకారంగా వెళ్లి ఇల్లు కావాలి అని బంగారు జింకన్ అడిగాడు. జింక రాము కోరిన విధంగా ఇల్లు అయితే ఇచ్చింది.
కొంతకాలం గడిచింది. సీత మెడ బోసిగా ఉంది కోరిక కలిగింది మెడలో ఏదైనా వేసుకోవాలని రాముని అడవికి పంపించింది. రాము వచ్చి అడగగానే బంగారు జింక తనకి మంచి బంగారు గొలుసు ఇచ్చింది.
మరికొంత కాలానికి. సీతకు ఒక రాజ్యానికి రాణి కావాలనే కోరిక కలిగింది. రాము అనగానే బంగారు జింక ఆ కోరిక కూడా తీర్చింది.
మరికొన్ని రోజులకు సీతకు మరో వింత కోరిక కలిగింది. రాము వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి. నా భార్య సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది. అని చెప్పాడు.
అప్పటికే కోరికలన్నిటిని ఇష్టం లేకుండా బంగారు జింక తీరుస్తుంది. ఆ కోరిక వినగానే చాలా కోపం వచ్చింది. సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలనుకోవడం ఎంత మూర్ఖం అయినా కోరిక .
నీ భార్యకు సూర్యచంద్రుని ఇంట్లో పెట్టుకోవాలని కోరికగా ఉందా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరే. అని బంగారు జింక అంతకముందు ఇచ్చిన వరాలన్నిటినీ వెనక్కి తీసుకుంది. మాయమైపోయింది.
రాము ఇంటికి తిరిగి వచ్చేసరికి సీత చెట్టు కింద బాధపడుతూ కూర్చుంది.
నీతి దురాశ దుఃఖానికి చేటు ఉన్నదంతో సంతృప్తి చెందాలి కానీ లేని దానికోసం ప*** ఇవ్వకూడదు.