కాకి దాహం Telugu story

Hemanth
0

 కాకి దాహం

అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది.  ఒక రోజు దానికి చాలా దాహం వేసింది. ఆ రోజు బాగా  ఎండగా  వుంది, ఆ వేడికి కాకి గొంతు పూర్తిగా ఎండిపోయింది. ఎగిరే  ఓపిక అయిపోయి, నీరసంగా నీళ్ళ కోసం వెతికింది.  చాలా సేపు వెతికాక ఒక కుండలో నీళ్ళు కనిపించాయి. ఆశగా ఆ కుండలో కాకిముక్కు పెట్టింది. కాని నీళ్ళు బాగ అడుక్కి వుండడంతో కాకి ముక్కుకు అంద లేదు. కాని తెలివైన కాకి ఒటమి ఒప్పుకోలేదు. చుట్టుపక్కల  పడున్న రాళ్ళను తీసుకుని వచ్చి ఆ కుండ లో పడేసింది. కుండ లోకి రాళ్ళు ముణిగిపోయి, నీళ్ళు పైకి తేలాయి. కాకి దాహం తీరే దాకా నీళ్ళు తాగి ఆనందంగా ఎగిరిపోయింది.  నిజమే, మనసు వుంటే మార్గం వుంటుంది.  ఈ కధ నేను మా మనవడు బబ్బుకి  చెప్పాను. అప్పుడు మా బబ్బుగాడు నాతో అన్నాడు తాతగారు “పాత కాలం కాకి కనుక కష్టపడి గులకరాళ్ళు వెతికి కుండలో వేసింది  అదే ఈ రోజులలో కాకి అయితే, ఒక ‘స్ట్రా’ వెతికి తాగేది అని”.   ఈ మాట విని నాకు చాల ఆశ్చర్యం అనిపించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)