మొదటికే మోసం ( ఓ మంచి నీతి కథ )
ఒక అడవిలో సింహం. చిరుత పులి కలిసి ఉండేవి. రెండిటికి వయసు అయిపోవడం వల్ల పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దానిలోని ఏదోలా సరిపెట్టుకునేవి.
ఒకసారి వరుసగా వారం రోజుల్లో తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయే. అదే సమయంలో వాటికి జింకపిల్ల కనిపించింది.
అప్పుడు సింహం...మిత్రమా' మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసి చిరు వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది.
దానికి చిరుతపులి. సరే అని అన్నది. రెండు కలిసి తెలివిగా వేటాడడం వల్ల జింక పిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధులు లేవు.
అయితే సింహం మాత్రం... కలసి వేటాడాలని ఆలోచన ముందు నాకు వచ్చింది. అందుకే నేను ముందు తింటా. అంది.
దాంతో చిరుతకి ఎక్కడ లేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింక పిల్ల ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తా. ఇద్దరం కలిసి వేటాడం ఇద్దరూ కలిసి తిందాం అని చెప్పింది.
దానికి సింహం ఒప్పుకోలేదు. మాట మాట పెరిగింది. అసలు నీకు వంతే ఇవ్వను మొత్తం నేనే తినేస్తా అని ఉరిమింది చిరుత. ఈ గొడవ అంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క చూస్తుంది. సింహం చిరుత రెండు గొడవ ఆడుకుని అలసిపోయాయి. ఇదే మంచి టైం అని నక్క వేగంగా వెళ్లి జింక పిల్లని ఎత్తుకొని పోయింది.
`అయ్యో కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే' అని బాధ పడ్డాయి సింహం. చిరుతపులి.