Telugu story

Hemanth
0

 

కలసివుంటే కలదు సుఖం —


అనగనగా రంగస్థలం అనే ఊరిలో రాంబాబు అనే ఓ వ్యాపారి.. తన ఏడుగురు కొడుకులతో నివసిస్తుండేవాడు. ఆ ఏడుగురూ ఎప్పుడూ దెబ్బలాడుకుంటూనే ఉండేవారు. తండ్రి అన్ని విధాలా ప్రయత్నించాడు. కాని వారిని కలపడం కుదరలేదు. ఒక రోజు తీవ్రంగా దెబ్బలాడుకుంటున్న కొడుకులను చూసి తండ్రి చాలా బాధ పడ్డాడు.


నీతి కథం


ఇలా ఉండగా రాంబాబు ఒక పథకం వేసాడు. కొడుకులని పిలిచి తలో కర్ర ముక్కని తీసుకుని రమ్మన్నాడు. ఏడుగురూ కర్రలను వెతికి తెచ్చారు. ఆ కర్రలను ఒక తాడుతో కట్టి ఒక కట్టలా చేయమన్నాడు. కొడుకులు కర్రల కట్ట తయారు చేసారు.



తండ్రి తన కుమారులను ముందుకి పిలిచి ఆ కట్టని విరగొట్టమని అందరినీ ఆదేశించాడు. వంతులు వంతులు గా ఏడుగురూ ఆ కర్రల కట్టను విరక్కొట్టడానికి ప్రయత్నించారు కానీ విరగొట్ట లేక పోయారు. ఇప్పుడు తండ్రి కట్టలోని కర్రలను విడతీసి ఏడుగురిని తలో కర్ర తీసుకొని విరగొట్ట మన్నాడు. దీంతో కొడుకులు సులభంగా ఆ కర్రలను విరగొట్టేసారు.


నీతి కథ:-


అప్పుడు రాంబాబు వాళ్లతో మీరందరూ ఈ కర్రల కట్టలా కలిసి ఉంటే మీరు బలంగా వుంటారు. మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. కానీ విడి విడిగా ఈ కర్రల్లా ఉంటే మీకు ఏ బలము వుండదు అని బోధించాడు.


 నీతి ఐక్యమత్యమే బలం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)