నేనూ నువ్వన్న పదము lyrics in Telugu

Hemanth
0

నేనూ నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగేనే ఇద్దరి ఎదలు
రానా నీడల్లే జతకు
కానా నీ కంటి వెలుగు
రాదే నేనుంటే నీకు దిగులు

కళ్ళముందు నువ్వుండగా
రెప్పకూడ పడదుగా
నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనబడరే
నే ప్రాణమైతే ఊపిరి నువ్వే
జన్మాలెన్నైన నీతోనే మొదలే

యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నా
విడువనంటా నీ చెయ్యే..
ఎవ్వరు నన్నే ఏమనుకున్నా
చివరిదాకా నీతోనే..

నేనూ నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగేనే ఇద్దరి ఎదలు

ఇరువురి తనువులకు
ఒకటే హృదయములే
వరమై ఊహలకే
నువ్వు దొరికావులే
నీతో గడపనిదే
సమయం గడవదులే
తలచిన మరుక్షణమే
ఎదురౌతావులే

ఆపగలనా మదినే
నిన్ను చూస్తే చెలియా
మోయగాలనా బాధే
కలవకుంటే సఖియా
గోరంత కూడా బంధించలేనే
నీపై నాకున్న కొండంత ఇష్టాన్ని

యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నా
విడువనంటా నీ చెయ్యే

ఓ యుద్ధమే రానీ సిద్ధమై ఉన్నా
ఎవ్వరు నన్నే ఏమనుకున్నా
చివరిదాకా నీతోనే

ఓ చివరిదాకా నీతోనే

ఇంత దగ్గరై ఇద్దరం కలిసుండాలని
ముందుగానే రాసి ఉంది తెలుసా
రేయి పవలూ ఒక్కటై పయనించాలని
వందయేళ్ళ జీవితముకే ఆశా

అలల నదిలా మెదిలే
కలల వెనుకే వెళదాం
పెదవి చివర నవ్వై
సెకనుకొకలా పుడదాం
రాజల్లే నేను రాణల్లే నువ్వు
ఆనందాలన్నీ ఏలాలి ఆశాంతం

ప్రేమొక సత్యం ప్రేమొక స్వర్గం
ప్రేమించడమో వరమేలే
ప్రేమొక ధైర్యం ప్రేమదే విజయం
ప్రేమకు అర్థం మనమేలే

నేనూ నువ్వన్న పదము
లేదే ఉందల్లా మనము
ప్రేమై పొంగేనే ఇద్దరు ఎదలు

______________

పాట: యుద్ధమే రానీ (Yuddhamae Raanee)
చిత్రం: బ్రాట్ (BRAT)
గాయకులు: సిద్ శ్రీరామ్ (Sid Sriram) శిరీష (Sireesha)
సంగీతం: అర్జున్ జన్య (Arjun Janya)
గీతరచయిత: సనారే (Sanare)
నిర్మాత: మంజునాథ్ వి. కంద్కూర్ (Manjunath V. Kandkur)
దర్శకుడు: శశాంక్ (Shashank)


Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)