కోడిపుంజులు - రాబందు
రామయ్య ఇంట్లో ఒక కోడిపుంజు, రంగయ్య ఇంట్లో ఒక కోడి పుంజు ఒక కోడిపెట్ట కోసం పోట్లాడుకుని ఒకదానిపై ఒకటి తలపడ్డాయి, ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కొంది, గెలిచిన కోడి పుంజు గెలిచిన గర్వంతో ఒక పూరిల్లు ఎక్కి బిగ్గరగా కోక్కరోకో అని అరవసాగింది, ఆకాశంలో ఎగురుతున్న ఓ రాబందు ఆ శబ్దం విని క్రిందకు దిగి ఆ కోడిపుంజును కాళ్ళతో పట్టుకొని ఎగరవేసుకు పోయింది, ఆప్పుడు పొదలో దాగి ఉన్న కోడిపుంజు కోడి పెట్టతో హాయిగా సహజీవనం సాగించింది.
నీతి: దేవుడు గర్వపోతులను శిక్షిస్తాడు.