ద్రాక్ష పళ్లు సాధించిన నక్క
ఒక నక్క అడవిలో. నివసిస్తూ
ఉండేది. అయితే అది
రోజూ ఆహారం కోసం
తిరుగుతూ ఉండేది. అయితే
ఒక రోజు దాని దారిన ఓ
తీగపై గుత్తులు గుత్తులగా
నిగనిగలాడుతున్న ద్రాక్షపళ్ళు
కనిపించింది. వాటిని
చూడగానే నక్కకి నోరూరింది.
వాటిని తినాలి అనే ఆశ
కలిగింది. కానీ అవి చాలా
ఎత్తులో ఉన్నాయి.
అయినా సరే అని
ఒక్కసారిగా ఎత్తుగా గెంతింది.
అందలేదు. కొంచెం దూరం
నుంచి పరిగెత్తుకుంటూ
దూకి చూసింది. అయినా
అందలేదు. అలా
పొద్దున్నుంచి సాయంత్రం
వరకు ప్రయత్నించింది.
చాలాసేపు ప్రయత్నించాక
అప్పుడు ద్రాక్ష పళ్ళు
దొరికాయి.
నీతి:-
కష్టపడిన వారికి
ఎప్పటికైనా ఫలితంవస్తుంది.