ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు lyrics in Telugu

Hemanth
0
Oosupodu, Fidaa
Singer: Hemachandra
Music: Shakthikanth Karthick
Lyrics: Chaithanya Pingali

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో

సోయి లేదు సోలనీదు
వీడిపోదు చేరి రాదు
చింత పోదు నాకిలా ఏమిటో
చింత పోదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోన్దే
ఆగేదేనా అరె ఈ ఆలోచన

నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపున తెలియక
నన్నే వెతికినాను

వల్ల కాదూ పాలు పోదు
ఆగనీదూ సాగనీదూ
వెంట రాదు నాకిలా ఏమిటో
వేళ కాదూ వీలు లేదు
ఊహ కాదూ ఓర్చు కోదూ
చెంత లేదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతుందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోoదే
ఆగేదేనా అరె ఈ ఆలోచన

నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపున తెలియక
నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదె
ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ పిలుపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదె
ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే

ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్లనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)