ఉదయించిన వేకువలోనా నయనంలో తొలి కలవై అలలెగసిన గుండెలలోనా ఊహలకే ఊపిరివై మదిచేరి ముంచకే మనసుని మత్తుగా
నాకే ఏమయ్యిందో తెలుసా నీకు కలలే కంటున్నా ఏమో ఏమవుతుందో అర్ధం కానీ కలవరమనుకోనా
తొలి పరిచయమా ఇది తొలి పరవశమా ఇది అలుపెరుగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
ఆశలే పెంచుకున్నా .. అవునా శ్వాసగా మార్చుకున్నా .. ప్రేమా నన్నలా చూసి గుండెతే కోసి అంత వేధించకే
నీడలా సాగుతున్నాంతోడుగా వెంటరానా ఎప్పుడూ నిన్ను వీడలేవంటు సంతకం చేయనా కనులెదురే కవ్విస్తున్నా నగవులతో ఊరిస్తున్నా నా ప్రతి అడుగూ నీకై వేస్తున్నా
తొలి పరిచయమా ఇది తొలి పరవశమా ఇది అలుపెరుగని ఆశతో మనసెందుకో నిను చేర్చమన్నదీ
మనసులో దాచుకున్నా అలలుగా పొంగుతున్నా చెరువే కావు తీరమై రావు ఎందుకే నేస్తమా మేఘమై సాగుతున్నా చినుకులా మారుతున్నా గొడుగులా మారి అడుగు వేశాను అందవేం అందమా
చూపులతో ఊరిస్తున్నా మౌనంగా వేధిస్తున్నా నా అణువణువూ నీకే ఇస్తున్నా
తొలి పరిచయమా ఇది తొలి పరవశమా ఇది అలుపెరుగని ఆశతో మనసెందుకో నిను చేరమన్నదీ
