నా ఈ గుండె నా అదుపు తప్పి lyrics in Telugu

Hemanth
0

నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే 
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ వేళిలా ఎందుకే 
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే

నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే
నా ఈ గుండె నా అదుపు తప్పి 
నా ఈ కనులు నీ వైపు తిప్పి 
నా ఈ మనసు నీతోటి కలిపి 
నేనే  నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి 
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి 

ఇది ప్రేమా అనుకుంటూ అడుగేసానా నేనేనా ?
నిను  నేనే ఏవేవో అడిగేసానా  నిజమేనా ?

నీ నీడలో నేనుండగా నీ అడుగుల వెంటే నేనే కదా
నీ చూపులే నా మనసుని ఆ అడిగేవన్నీ నిజమే కదా
కదిలేనా  నీ తలపు  లేకుండానే క్షణమైనా

నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే 

కనుతెరిచి ఏదేదో చూస్తూ ఉన్న కనబడ 
కనులెదుట నీ రూపే కదులుతూ ఉంది కల కా 

నీ లోకమై నేనుండగా నీ చూపుల నిండా నేనే కదా 
నా ఊపిరై నువ్వుండగా నా ఈ ప్రాణం నీదే కదా 
కడదాకా ఒక్కటై నిలవాలి ఏమైనా 

నిన్నలా లేదే మొన్నలా లేదే ఈ రోజిలా ఎందుకే 
నిన్నిలా నాకే కొత్తగా చూపే ఈ  వేళిలా ఎందుకే 
నువ్విలా నాలో నేనిలా నీలో లీనమై పోయెందుకే

నా ఈ గుండె నా అదుపు తప్పి 
నా ఈ కనులు నీ వైపు తిప్పి 
నా ఈ మనసు నీతోటి కలిపి 
నేనే  నీలో నిలువెల్ల కలిసి
నీ ఆ పెదవి ఓ నవ్వు చూపి 
మౌనంగానే ఏదేదో తెలిపి
నాలో ఉన్న ప్రాణాలు నలిపి
నేనే నాకు లేకుండ చేసి
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)