ప్రేమ ఓ ప్రేమ (కన్నుల్లో కలలా మెరిసి) సాంగ్ లిరిక్స్
కన్నుల్లో కలలా మెరిసి
అందాల కథల కలసి
వెళ్లావు వదిలి నన్నిల
కన్నీటి కలలై కరిగి
గుచ్చేటి గురుతై మిగిలి
ఉన్నావు ఎదలో నువ్వీలా
తడి కన్నుల్లోన నువ్వే
ఎద గాయంలోన నువ్వే
ఎటు చూస్తూ ఉన్న నువ్వే ప్రియతమా
నా ప్రాణంలోన నువ్వే
నా మౌనంలొన నువ్వే
ఎటు అడుగుగేస్తున్న నువ్వే ప్రియతమా
ప్రేమ ఓ ప్రేమ ఐపోతున్న దూరం
ప్రేమ ఓ ప్రేమ నాదేనంటవా నేరం
ప్రేమ ఓ ప్రేమ నిను కలవడం శాపమా....
నువ్వు నిజమే నేను నిజమే
మనసు కలిపే చెలిమి గుణమే
మారిందిలా ఓ మాయలా
ఈ పెను యాతన చల్లారెనా
నను నవ్వించిందీ నువ్వే
నను కవ్వించిందీ నువ్వే
నను ఎడ్పిస్తుందీ నువ్వే
ప్రియతమాా...
నా స్వాసల్లోనా నువ్వే
నడి ఆశల్లోనూ నువ్వే
నను చంపేస్తుందీ నువ్వే
ప్రియతమాా...
ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం
ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం
ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా
ప్రేమ వరమే ప్రేమ మనమే
మనసులోనీ ఆశ నిజమే
చెప్పేదెలా నీతో ఇలా
నాలోని స్పందనా క్షమాపనా
నా నీడై ఉందీ నువ్వే
నను వెంటాడిందీ నువ్వే
నా చుట్టూ ఉందీ నువ్వే
తెలుసునా...
నను కదిలించిందీ నువ్వే
నను కరిగించిందీ నువ్వే
నా లోకం మొత్తం నువ్వే
తెలుసునా...
ప్రేమా ఓ ప్రేమా
నువులేని నేనే శూన్యం
ప్రేమా ఓ ప్రేమా
నీకోసం వెతికే ప్రాణం
ప్రేమా ఓ ప్రేమా
నిను మరువడం సాద్యమా...
