గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది lyrics in Telugu

Hemanth
0
పల్లవి :
గుండెల్లో ఏముందోకళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణమిది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా..!

చరణం : 1
పువ్వులో లేనిది నీ నవ్వులో ఉన్నది
నువ్వు ఇపుడన్నది నేనెప్పుడూ విననిది
నిన్నిలా చూసి పయనించి... వెన్నెలే చిన్నబోతోంది
కన్నులే దాటి కలలన్నీ... ఎదురుగా వచ్చినట్టుంది
ఏమో... ఇదంతా... నిజంగా కలలాగే ఉంది!
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది

చరణం : 2
ఎందుకో తెలియని కంగారు పడుతున్నది
ఎక్కడా జరగని వింతేమి కాదే ఇది
పరిమళం వెంట పయనించి... పరుగు తడబాటు పడుతోంది
పరిణయం దాక నడిపించీ... పరిచయం తోడు కోరింది
దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది!

గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది
పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది
నిలవదు కద హృదయం... నువు ఎదురుగ నిలబడితే
కదలదు కద సమయం... నీ అలికిడి వినకుంటే
కలవరమో తొలివరమో తీయని తరుణమిది!
మనసా మనసా మనసా మనసా మనసా మనసా
మనసా మనసా మనసా ఓ మనసా..!


చిత్రం : మన్మధుడు (2002)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : సిరివెన్నెల
గానం : వేణు, సుమంగళి
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)