Hello guys 🤠 👋
నేను మీ హేమంత్.
ఈరోజు మీ ముందుకి ఒక మంచి లిరిక్స్ తీసుకొచ్చా.
మొత్తం చదివి ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి..
Lyrics
పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం
ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం
హాయి ఇంకొంచెం
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే
చేతికందే రోదసే
హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హ్మ్మ్ ఒకటంటే ఒక్క జన్మే ఎవ్వరికైనా
బతుకుతూ వెతుకుదాం బతుకులో తీపిని
దూరంగా ఎగిరిపోదాం ఎక్కడికైనా
తూరుపు పడమరా దిక్కులే లేవని
ఆశలకి రెక్కలు ఊహలకి మొప్పలు
కట్టుకున్న ఈ క్షణం మాట వినదే
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే
హే ఆదమరుపులు కొంచెం
ఆటవిడుపులు కొంచెం
మూతి ముడుపులు కొంచెం
హాయి ఇంకొంచెం
చూపులేవో లేఖలు రాసే
మౌనమేదో రాగం తీసే
సైగలేవో ఊపిరి పోసే
వయసు మనకే బానిసే
నింగి అంచుకి చినుకులు పూసే
నేల అంచుకి పువ్వులు పూసే
గుండె అంచుకి గురుతులు పూసే
చేతికందే రోదసే
హే పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే
కనుల చివరకే వెలుగేదో వలసొచ్చే.
గైస్ ఈ సాంగ్ ఎంతమందికి నచ్చింది, గాయ్స్ నిజంగా చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది గయ్స్..
#పేట ❤️