బాగుండు పో (Baagundu po) సాంగ్ లిరిక్స్, Dude | Pradeep Ranganathan
నీ ఇష్టం సర్లే కానీ
ఇచ్చేశా నిన్నే నీకే
ఆనందంగా బతకవే పో..
ఈ భారం పోయేదే కాదే
అయినా చెలీ సెలవంటున్నానే
ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో
గాయమే కానీవే
గుండెలే పెరికేసానే
నిన్ను నీకిచ్చేసానే నవ్వుతూనే
ఎవ్వరినీ ఏమంటానే
నేరమే నాదంటానే
శిక్షగా చివరంటానే
శూన్యమై మిగిలుంటానే
వేరొకరి చేతుల్లో
నీ చెయ్యి చూస్తున్నానే
బరువుగా నిట్టూర్చా బాధలోనే
నిన్న నీ కన్నుల్లోనే
కాటుకై ఉన్నది నేనే
నా కంటి నీళ్లతో నన్నే
నేడిలా చేరిపేసావే
ఏ రేపు నీ చూపు నావైపు రాకున్నా వెయ్యేళ్ళు బాగుండుపో
ఏకాకి లోకనా ఎలాగా నేనున్నా నువ్వైనా బాగుండుపో
ఇంకెవరితోనో నీ జంట
నువ్వులేని నాకు ఎదమంట
ముక్కలైన నాకు దిక్కు తోచదంట
అయినా వెళ్ళిపో
నన్ను దాటి పోవే పొమ్మంటా
మళ్లీ ఇటు రానే వద్దంటా
అంతులేని ప్రేమ అక్షతలు వేసి
దీవించలే పో
