🎤 “వినియోగదారులు జాగ్రత్త..! ఇకపై రైల్వేలో లగేజ్ నియమాలు ఎయిర్‌పోర్ట్ స్టైల్ లోకి మారబోతున్నాయి.!”
🚆 ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ కొత్త లగేజ్ పాలసీని అమలు చేయబోతోంది. ఇప్పటి వరకు రైలులో ఎవరైనా పెద్ద సూట్‌కేసులు, ఎక్కువ బాగులు తీసుకెళ్లినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇకపై మాత్రం కచ్చితమైన వెయిట్ చెకింగ్ ఉంటుంది.
📦 క్లాస్ వారీగా లగేజ్ వెయిట్ లిమిట్ ఇలా ఫిక్స్ చేశారు –
🛏 ఫస్ట్ ఏసీ ప్రయాణికులు 👉 70 కిలోల వరకు (అదనంగా 10 కిలోల రాయితీ)
🛏 సెకండ్ ఏసీ 👉 50 కిలోలు + 10 కిలోల రాయితీ
🛏 త్రీ టియర్ ఏసీ / స్లీపర్ 👉 40 కిలోలు + 10 కిలోల రాయితీ
🚉 జనరల్ క్లాస్ 👉 35 కిలోలు + 10 కిలోల రాయితీ
⚖️ ఎవరైనా ఈ లిమిట్ దాటితే, తప్పనిసరిగా పార్సిల్ వాన్ లో ముందే బుకింగ్ చేయాలి. లేకపోతే, ఫైన్ లేదా మల్టిపుల్ చార్జీలు వేయబోతున్నారు.
💰 సమాచారం ప్రకారం, ఓవర్ సైజ్ లగేజ్ ఉంటే సాధారణ ఛార్జ్ కంటే ఆరు రెట్లు వరకు ఫైన్ వసూలు చేసే అవకాశం ఉంది.
📍 మొదటగా ఈ రూల్స్ ని ప్రయాగ్‌రాజ్ జంక్షన్, లక్నో, కాన్పూర్ లాంటి పెద్ద స్టేషన్లలో ట్రయల్ బేసిస్ పై అమలు చేస్తున్నారు. అక్కడ ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, స్కానర్స్ పెట్టి లగేజ్ చెక్ చేస్తున్నారు. అంటే ఇకపై స్టేషన్ ఎంటర్ అయ్యే ముందు మీ లగేజ్ వెయింగ్ తప్పనిసరి!
---
👉 మొత్తానికి, ఇకపై రైలులో ప్రయాణం కూడా ఎయిర్‌పోర్ట్ ట్రావెల్ ఫీలింగ్ ఇచ్చేలా మారబోతోంది. కాబట్టి ప్రయాణానికి ముందు మీ లగేజ్ ని ఒకసారి తూకం వేసుకుని, లిమిట్ లోపలే ఉంచండి.
🎙️ “లేకపోతే... అదనపు బరువు అంటే అదనపు ఖర్చు తప్పదు..!”