రైలుబండి Railu Bandi, Gangotri lyrics in Telugu

Hemanth
0

 Railu Bandi, Gangotri

   Telugu                  English 

చిక్ బుక్.... చిక్ బుక్....గంగోత్రి    

చిక్ బుక్.... చిక్ బుక్.... చిక్ బుక్....


రైలుబండి రైలుబండి  కూతలోనె పాట ఉంది పాటలోని స్వరాలన్నీ     ||చిక్ బుక్....||

సరిగమ సరిగమ  సరిగమ  పదనిస


రైలుబండి  : రైలుబండినడకలోనే నాట్యం ఉంది నాట్యంలోని జతులన్నీ

చిక్ బుక్....  చిక్ బుక్....  చిక్ బుక్.... ఆ: తకదిమితకదిమి తకదిమి తకజణు

అలసటే లేని సంగీతాన్ని చేరిపేస్తుందీ  రైలుబండి.... || చిక్ బుక్....||


కేరళలోన కొబ్బరి నీళ్ళు తాగిస్తుందండీ...

ఆంధ్రలోన పెసరట్టు ఉప్మా పార్శిల్ కట్టించి

మహారాష్ట్రాల్లో మధ్యాహ్నానికి రోటీ ఇస్తుంది       ||  చిక్ బుక్....||


ఆగ్రా సౌధం చూపించి సిమ్లా ఆపిల్ అందించి

హరిద్వారులో అడుగేసి హృషికేష్ లో తిప్పింది

గంగోత్రికి చక చకమంటూ పరుగులు తీస్తుంది....

కూకూ....కూ....కుకుకుకూ.... అ: గంగోత్రి    ||చిక్ బుక్....||


ఎండ్ల్లోన మండుతు ఉన్నా నీడను మనకిచ్చి

వానల్లోన తానే తడిసి గొడుగవుతుందండీ.....||.చిక్ బుక్....||


రాత్రంతా తను నిద్దరమాని మేల్కోంటుందండీ

అమ్మల్లే మనకూయలుపి జోకొడుతుందండీ      ||చిక్ బుక్....||


సెలవులు తనకు వద్దంటూ స్నేహితులను మనకందిస్తూ....

అందరి భారం మోసేస్తూ ...కోరిన తీరం చేరుస్తూ....

మతమూ కులమను భేదం తనకు లేవంటుందండీ....

మానవ జాతిని ఒకే తాటిపై నడిపిస్తుందడీ....

చిక్ బుక్.... :చిక్ బుక్... :చిక్ బుక్....  గంగోత్రి          ||రైలుబండి||

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)